సత్యసాయి: ధర్మవరం పట్టణంలో శాంతినగర్‌లో రైల్వే ఓవర్‌బ్రిడ్జి కింద వర్షానికి నీరు నిలిచింది. నియోజకవర్గ ఇంఛార్జ్ హరీష్ బాబు మున్సిపల్ ఈఈ సాయి కృష్ణ, డీఈ వీరేష్‌తో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే నీటిని తొలగించి రాకపోకలకు మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్రైనేజీ, నీటి ప్రవాహ మార్గాలను పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
శాంతినగర్‌లో వర్షపు నీటి తొలగింపు


