హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ

ASR: పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఏపీ నేషనల్‌ గ్రీన్‌ కార్ప్స్‌ ఆధ్వర్యంలో చింతపల్లిలో జీవశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. ఇందులో చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా కోఆర్డినేటర్‌ జి.కొండబాబు పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యంపై దిశానిర్దేశం చేశారు.