హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేతన్న నేస్తం అమలయ్యేలా చూడండి'

BPT: ఉమ్మడి ప్రకాశం జిల్లా చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ దామర్ల కృష్ణ ఆధ్వర్యంలో చేనేత సంఘాల సభ్యులు చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. నేతన్న నేస్తం పథకం అర్హులైన ప్రతి నేతన్నకు అందేలా చూసి, కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల చేనేత సంఘాల సభ్యులు పాల్గొన్నారు.