హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ 27న జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొనాలని కోరారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.