హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎస్‌పురంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

ప్రకాశం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం సీఎస్‌పురం మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ బలోపేతం, ఎన్నికల కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.