హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి కొండపై రోడ్డు ప్రమాదం

BHNG: యాదాద్రి కొండపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ఈశ్వరమ్మను (35) కారు ఢీకొంది. ఈ ఘటనలో యాచకురాలు అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అనుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డ్రైవరు‌ను అదుపులో తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.