హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన అరుణమ్మ

KDP: జమ్మలమడుగు పట్టణంలోని ఈడిగపేట ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సతీమణి అరుణమ్మ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, వంటశాల పరిశుభ్రత, సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడంతో పాటు ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు.