BDK: గణేష్ నిమజ్జనం కోసం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు SP రోహిత్ రాజు తెలిపారు. నిమజ్జన శోభా యాత్రలు జరిగే ప్రధాన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు జారీ చేసిన నిబంధనలు అతిక్రమించవద్దని కోరారు.
తెలంగాణ
'గణేష్ నిమజ్జనానికి 1000 మంది పోలీసులతో భద్రత'


