హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్‌తో పేద ప్రజలకు ఆర్థిక భరోసా: MLA

ADB: ముఖ్యమంత్రి సహాయనిధితో పేద ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఇచ్చోడ మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన బొంగురాల పూల బాయికి మంజూరైన రూ. 54 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలను సమర్పించి తద్వారా లబ్ధి పొందాలని అనిల్ జాదవ్ సూచించారు.