MHBD: జిల్లాలో పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 2,027 పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు SP శబరీశ్ తెలిపారు. గుర్తించిన 77 మొబైల్ ఫోన్లను మంగళవారం టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితులకు అందజేశారు. మొబైల్ పోగొట్టుకున్నా, చోరీకి గురైన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. అనంతరం ఫిర్యాదు దారులు SPకి ధన్యవాదలు తెలిపారు.
తెలంగాణ
'CEIR పోర్టల్ ద్వారా 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ'


