ATP: ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్లను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. భద్రతా చర్యలు, లాగ్ బుక్‌లను తనిఖీ చేసి, తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో మాలోల పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన కలెక్టర్


