హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్మిక పోరాట యోధుడు తిక్కన్నకు ఘన నివాళి

KRNL: విప్లవోద్యమ, కార్మిక నేత కామ్రేడ్ కే.తిక్కన్న సేవలు చిరస్మరణీయమని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత ఎం.సత్యన్న అన్నారు. తిక్కన్న నాల్గవ వర్ధంతి సందర్భంగా ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో నివాళులర్పించారు. కార్మికులు, రైతులు, విద్యార్థుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తుచేశారు. ప్రజా, కార్మిక ఉద్యమాలను కొనసాగించడమే తిక్కన్నకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.