JGL: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసి, శోభాయాత్రలను శాంతియుతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మంగళవారం రాయికల్ పట్టణ శివారు వాగు వద్ద ఏర్పాట్లను ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా వేడుకలు జరుపుకోవాలని, భక్తులు, మండప నిర్వాహకులు అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
తెలంగాణ
నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్


