హైదరాబాద్: 28°C
క్రీడలు

T20Iల్లో భారత్‌కు అతిపెద్ద విజయం

ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంక మహిళల జట్టుపై ఫైనల్లో భారత్ 147 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. T20Iల్లో భారత్‌కు పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం. గతంలో మలేషియాపై నమోదు చేసిన 142 పరుగుల విజయాన్ని.. శ్రీలంకతో మ్యాచ్‌తో భారత్ బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు శ్రీలంక జట్టుకు పరుగుల పరంగా ఇదే అతి పెద్ద ఓటమి.