హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు

ఆసియా క్రీడలలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డును సమం చేసింది. ఈ మ్యాచ్‌తో మహిళల T20I క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ఇంగ్లండ్ సరసన నిలిచింది. ఇంగ్లండ్ 233 మ్యాచ్‌లు ఆడగా, భారత్ కూడా సరిగ్గా 233 మ్యాచ్‌లు ఆడింది. భారత్ ఇప్పటివరకు ఆడిన 233 మ్యాచ్‌లలో 130 గెలిచి, 95 ఓడిపోయింది.