హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేషుడికి మంత్రి ప్రత్యేక పూజలు

BHPL: కాటారం మండల కేంద్రంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం పర్యటించారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. గణేష్ నిర్వహకులు పోలీసులకు సహకరించాలని మంత్రి కోరారు.