BDK: మణుగూరు తహశీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పలు రెవెన్యూ అంశాలు, కార్యాలయ రికార్డులను పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
తహసీల్దార్ ఆఫీస్‌లో సబ్ కలెక్టర్ తనిఖీలు


