హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

JGL: వెల్గటూర్ మండలం చెగ్యాంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షం కారణంగా వాతావరణం చల్లబడటంతో ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. వర్షం పంటలకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు పేర్కొన్నారు.