JN: లింగాల ఘనపురం మండలం జీడికల్‌లోని శ్రీ జీడికంటి వీరాచల రామచంద్రస్వామి దేవస్థానాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'రామచంద్రస్వామి ఆలయంలో MLA ప్రత్యేక పూజలు'


