హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోరుకల్లులో వరదలపై కాటసాని ఆందోళన

NDL: గోరుకల్లు గ్రామంలోకి వరద నీరు చేరడంతో వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి పరిస్థితిని పరిశీలించారు. గేట్ల నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే నీరు గ్రామంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రజల భద్రతపై అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ను కోరారు.