WG: భీమవరం మెంటేవారి తోటలో మంగళవారం శ్రీబాలా గణేశ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని MLA పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో స్థానిక యువత పాల్గొని రక్తదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో మెగా రక్తదాన శిబిరం


