హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూళ్లూరుపేట, తడలో పోలీస్ నిఘా ముమ్మరం

TPT: సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు పోలీస్ నిఘా పెంచినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొడవలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించబోమన్నారు.