హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ఎన్టీఆర్: చందర్లపాడు మండలంలోని కోనయపాలెంలో మంగళవారం గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) ఆధ్వర్యంలో రైతులకు వడ్డీ లేని రాయితీ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని 374 మంది రైతులకు మొత్తం రూ.15 లక్షల విలువైన వడ్డీ లేని రాయితీ చెక్కులను పంపిణీ చేశారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.