హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేంద్ర మంత్రి నుంచి నియామాక పత్రంఅందుకున్న సాయి వర్షిత

కడప: పులివెందుల పట్టణానికి చెందిన అనిలాదేవి, గురుదత్త దంపతుల కుమార్తె సాయి వర్షిత ఎస్ఎస్ సీ-సీజీల్ పరీక్ష రాసి విజేతగా నిలిచి ఇన్‌ టాక్స్ కీలక విభాగమైన పరిశోధన ఇన్‌స్పెక్టర్ కొలువును సాధించింది. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీన ఆమె బెంగళూరులో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో కేంద్రమంత్రి శోభా కరంద్లజే చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.