హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రామీణ రహదారులకు మహర్దశ'

కోనసీమ: రాయవరం మండలంలో రూ.7.70 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సాస్కి, పీఎంజీఎస్‌వై, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో రహదారులు, సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.