హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫైనల్ మ్యాచ్.. టాస్ గెలిచిన టీమిండియా

ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టుపై భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో ఓడించిన శ్రీలంక జట్టుతోనే ఆసియా క్రీడల్లోనూ తుది పోరులో భారత్ తలపడుతోంది. జపాన్, బంగ్లాదేశ్‌లను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరిన టీమిండియా ఆ స్థాయిలో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.