ఏలూరు: జంగారెడ్డిగూడెం మార్కెట్, వీధి వ్యాపార ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టారు. రోడ్లు, డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను సిబ్బంది తొలగించారు. మున్సిపల్ కమిషనర్ కె. వెంకటరమణ మాట్లాడుతూ.. వ్యాపారులు, ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లోనే వేసి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు


