హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో నిమజ్జన వేదిక మార్పు

KMM: ఖమ్మంలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వీడ్కోలు వేదిక ఈసారి మారనుంది. మున్నేరులో నీరు లేకపోవడంతో ధంసలాపురం చెరువులో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గాంధీచౌక్‌లో కాకుండా తొలిసారిగా ముస్తఫానగర్‌లో స్వాగత వేదిక ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవ నిర్వహకులు గమనించాలని కోరారు.