NGKL: కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన మాదే పల్లవి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పల వెంకటేష్ మృతురాలి కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించారు. ఎల్లికట్ట ఫ్రెండ్స్ హెల్పింగ్ ఫౌండేషన్ ద్వారా ఈ సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎల్లికట్టలో మృతురాలి కుటుంబానికి చేయూత


