హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు నగరంలో 4.79 లక్షల మంది ఓటర్లు

KRNL: కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 68 వార్డుల వారీగా ఓటర్ల జాబితాను కమిషనర్ చల్లా ఓబులేసు మంగళవారం ప్రదర్శించారు. 2026 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా తీసుకున్న జాబితా ప్రకారం నగరంలో మొత్తం 4,79,861 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,32,508 మంది పురుషులు, 2,47,295 మంది మహిళలు, 58 మంది ఇతరులు ఉన్నారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.