హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. హన్మాజీపేట వాసి మృతి

JGL: హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన యెన్నం రాజేంద్రప్రసాద్ (24) మృతి చెందాడు. నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న అతడు, ద్విచక్ర వాహనంపై వెళ్తూ మూసాపేట వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ఎదురుగా వచ్చిన మరో వాహనం బలంగా ఢీకొట్టింది. చికిత్స పొందుతూ మృతి చెందాడు