హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ మండపం వద్ద యువకుడి మృతి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లిలో సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణేష్ మండపం వద్ద దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో గడ్డం మధు అనే యువకునికి అనుకోకుండా విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. ఇది గమనించిన తోటి స్నేహితులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.