హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో భారీ వర్షాలు.. నేలకొరిగిన వృక్షాలు

విశాఖలో సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మధురానగర్, ఎంవీపీ కాలనీ, శ్రీనగర్ ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. సమాచారం అందుకున్న జీవీఎంసీ సిబ్బంది వెంటనే చెట్లను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో చెట్ల కింద ఉండొద్దని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.