హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గిరిజనుల అర్జీలను తక్షణమే పరిష్కరించాలి'

MLG:ప్రజావాణిలో గిరిజనులు సమర్పించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పొ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 27అర్జీలు అందాయి. విద్య,పోడు భూములు, జీవనోపాధి, సాగునీరు, విద్యుత్, పునరావాసం, ఆర్థికసాయం, పంచాయతీ భవనపనులకు సంబంధించిన సమస్యలపై వినతులువచ్చాయి. ప్రతిదరఖాస్తును పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.