హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ విద్యార్థులకు లఘు చిత్రాల పోటీ: DMHO

కోనసీమ: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 'ఆడపిల్లలను రక్షిద్దాం' అనే అంశంపై లఘు చిత్రాల పోటీ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి దుర్గారావు దొర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొనాలని కోరారు. ఉత్తమంగా నిలిచిన మొదటి మూడు లఘు చిత్రాలకు బహుమతులు అందజేస్తామన్నారు.