హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారిపై భారీ గుంతలు

HYD: సికింద్రాబాద్‌ రైల్ నిలయం నుంచి తార్నాక వెళ్లే ప్రధాన రహదారిలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిని పట్టించుకునే నాథుడే లేడని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచి అవి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.