ఆసిఫాబాద్ మండలం బురుగూడలో మేకర్తి మల్లక్క (80) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె ఒంటరిగా నివసించేది. వారం రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు ఇంటికి వెళ్లి చూడగా మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతదేహంపై కట్టెలు ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఇంట్లో కుళ్లిన స్థితిలో వృద్ధురాలి మృతదేహం


