హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఆస్పత్రిలో సౌకర్యాల కరవు.

VKB: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు తిప్పలు పడుతున్నారు. 50 పడకల క్రిటికల్ కేర్ భవనం ఉన్నా సిబ్బంది మాత్రం లేరు. ఆసుపత్రిలో MRI, సిటీ స్కాన్ లేవు, ఎకో మెషిన్ ఉన్నా ఆపరేటర్ లేరు. దీంతో అత్యవసరమైతే హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. ఓపీ వద్ద షెడ్డు లేక ఎండలోనే నిలబడాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.