JN: రఘునాథపల్లి మండలం వెల్ది మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పాలకుర్తి శ్రీధర్, సామాజిక శాస్త్ర ఉపాధ్యాయురాలు శశికుమారికి జెట్ స్టేట్ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు–2026 లభించింది. వినూత్న బోధనా విధానాలు,సాంకేతిక వినియోగానికి గుర్తింపుగా రాష్ట్రస్థాయిలో ఎంపికైన 50 మందిలో వీరికి చోటు దక్కింది. సోమవారం సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారు.
తెలంగాణ
ప్రిన్సిపల్, టీచర్‌కు జెట్ అవార్డులు


