HNK: శాస్త్రీయ నృత్యాలతో భక్తుల్లో ఆధ్యాత్మికత పెంపొందుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కాజీపేటలోని విష్ణుపురిలోని శ్వేతార్క ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయన ఆలయాన్ని సందర్శించారు. శాస్త్రీయ నృత్యాలతో అలరించిన విద్యార్థినులను ప్రశంసాపత్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో రాధాకృష్ణశర్మ, సాయికృష్ణశర్మ, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
శాస్త్రీయ నృత్యాలతో ఆధ్యాత్మికత: ఎమ్మెల్యే నాయిని


