హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోర్టు ధిక్కరణ.. ఉద్యోగి అరెస్టు

WGL: చెన్నారావుపేట కోర్టు నోటీసులను ధిక్కరించిన ప్రభుత్వ ఉద్యోగి చెలుకలపల్లి నర్సింహస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదానికి సంబంధించి కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ అయినా హాజరుకాకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు అరెస్టుచేసి నర్సంపేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేసినట్లు ఎస్సై రాజేష్‌రెడ్డి తెలిపారు.