హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలను పురస్కరించుకుని రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ శుద్ధి కార్యక్రమంలో భాగంగా గర్భాలయం, ఉపాలయాలు, పరిసరాలను శుద్ధి చేయనున్నారు. ఈనెల 23న అంకురార్పణ, 24న పవిత్రోత్సవాలు ప్రారంభంకానున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.