VIDEO: అచ్చంపేట పట్టణంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వాతావరణంలో మార్పులతో కురిసిన వానతో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లటి వాతావరణం నెలకొంది. పంటలు ఎండిపోతున్న వేళ వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వర్షాకాలంలో తొలిసారి భారీ వర్షం పడటంతో పంటలకు కొంత ఊరట లభించిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
అచ్చంపేటలో భారీ వర్షం


