ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రాత్రివేళల్లో పశువులు గుంపులుగా సంచరిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. రోడ్డుపై పశువులను వదిలితే రూ.500 జరిమానా ఉంటుందని అధికారులు హెచ్చరించినా యజమానులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: రాత్రివేళల్లో ప్రధాన రహదారిపై పశువుల సంచారం


