హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి'

JGL: కథలాపూర్‌లో వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని సీఐ లక్ష్మీనారాయణ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని, మద్యం సేవించకూడదని సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.