హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు వ్యవసాయ మార్కెట్ బంద్

MHBD: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు రేపు బంద్ ఉండనుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా మార్కెట్ యార్డులో బుధవారం క్రయవిక్రయాలు బంద్ ఉంటాయని AMC చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించి రేపు మార్కెట్కి సరుకులు తీసుకొని రావద్దని సూచించారు.మళ్లీ గురువారం మార్కెట్ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.