హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయిలో సత్తెనపల్లి ఘనత

PLD:​ సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం 9వ తరగతి విద్యార్థి శ్లోక్ గుప్తా జాతీయ స్థాయిలో మూడో బహుమతి సాధించాడు. ఏఐజీఎంఎఫ్ నిర్వహించిన ‘గ్లాస్ ఇన్ ఇన్‌స్టిట్యూషన్’ పోటీలో ప్రతిభ చూపి రూ.10,000 నగదు బహుమతి గెలుచుకున్నాడు. దేశవ్యాప్తంగా కేవీఎస్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థి శ్లోక్ కావడం విశేషం. ఉపాధ్యాయులు అతడిని అభినందించారు.