హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'25న డీ-వార్మింగ్ డే పకడ్బందీగా నిర్వహించాలి'

VSP: పిల్లల్లో నులిపురుగుల నిర్మూలన లక్ష్యంగా ఈ నెల 25న డీ-వార్మింగ్ డే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 5,74,496 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా అందించాలని సూచించారు. 25న తీసుకోలేని వారికి అక్టోబర్ 5న మాప్‌అప్ రౌండ్‌లో మాత్రలు ఇవ్వాలన్నారు.