హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలుడి ప్రాణం తీసిన పిడుగు!

GDWL: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కేటీదొడ్డి మండలం ఎరసన్‌దొడ్డి గ్రామ శివారులో జరిగిన పిడుగుపాటు ఘటనలో మల్లయ్య (17) అనే బాలుడు మృతి చెందాడు. వర్షం వస్తుండటంతో చెట్టుకింద ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ పిడుగుపాటు ధాటికి బాలుడితో పాటు రెండు గొర్రెలు కూడా అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.