హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి

MLG: పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని సోమవారం ఇటలీకి చెందిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి రోసన్నా నిట్టీ సందర్శించారు. అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. గైడ్ విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవాన్ని వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు.